మహేష్ పుట్టినరోజు ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్…. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్..
ప్రతి సంవత్సరం మహేష్ బర్త్ డే కి పాత సినిమా ని రీ రిలీజ్ చేసి థియేటర్స్ లో సెలబ్రేట్ చేస్కోడం ఒక ట్రెండ్ గా మారినిది ఫ్యాన్స్ కి.ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా మురారి సినిమాని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.
ఈసారి మాస్ పిక్చర్ కాదు…ఫుల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని రీ రిలీజ్ చేస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన మురారి అప్పట్లో మహేష్ సినిమాలలో ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా మురారి.
ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా తో సాగేమంచి క్లీన్ కథ ఇది. మహేష్ మరియు సోనాలి కెమిస్ట్రీ సినిమా హైలైట్ గా నిలిచింది. ఇంకా మణిశర్మ ఇచ్చిన ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఇప్పటికి జనాలు వింటూనే ఉన్నారు.”అలనాటి రామ చంద్రుడు” పాట లేకున్నా ఈ పెళ్లి వేడుక జరగదు, అలాంటి ట్రేడ్ మార్క్ సెట్ చేసారు మణిశర్మ గారు ఈ ఆల్బమ్ తో.
మురారి తో పాటు ముందు రోజు (ఆగస్టు 8) రాత్రి 9 గంటలకి ఒక్కడు సినిమా షోలు ప్లాన్ చేసారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇది మహేష్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ గా చెప్పొచ్చు. రాజమౌళి మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి బారీ హైప్ ఉంది .కానీ మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా అప్ డేట్ వస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com