తుది జట్టు ప్రకటించిన బీసీసీఐ ….టీ20 ప్రపంచకప్ తమ లక్ష్యం అంటున్న రోహిత్ సేన
2023 ప్రపంచ కప్ వైఫల్యానికి బదులు చెప్పాలని టీమ్ ఇండియా సిద్దం అయ్యింది . అమెరికా మరియూ వెస్టిండీస్ వేదికగా జరగనున్న 2024 T20 ప్రపంచ కప్ సమరానికి జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ .
IPL 2024 లో ప్రతి భారత ఆటగాడు తమ సత్తా చాటి ఫైనల్ జట్టు లో ప్లేస్ సాధించాలి అని చెలరేగిపోయారు . సెలక్షన్ కమిటీ కి పెద్ద సమస్యనే తెచిపెట్టినది IPL 2024. ప్రధానంగా wk (కీపర్) బ్యాట్స్‌మన్ గా ఎవర్నీ తీస్కుంటారో అని అంతా వేచి చూశారు.15 మంది సభ్యుల జట్టులో ఆటగాళ్లను ఎంపిక చెయ్యడం కత్తి మీద సాము లాంటిది.
రాహుల్ ని కాదు అని పంత్ మరియు శాంసన్ వైపు బీసీ మొగ్గు చూపింది. రింకు సింగ్ కి తుడి జట్టు లో ప్లేస్ దొరకలేదు . విరాట్ ప్లేస్ పై వచ్చిన గందరగోళం లా కి క్లారిటీ వచ్చింది .
15 మంది సభ్యుల జట్టు జాబితా
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), సంజు శాంసన్ (WK), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్.
శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు అవేష్ ఖాన్ లను రిజర్వ్ ప్లేయర్స్గా ఎంపిక చేసారు.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇటీవలి ఫామ్‌లో లేనప్పటికీ, కొనసాగుతున్న IPLలో ముంబై ఇండియన్స్ నాయకత్వాన్ని తీసుకున్న తర్వాత వైస్ కెప్టెన్‌గా కొనసాగాడు.రోహిత్ మరియూ కోహ్లికి ఇదే చివరి టీ20 వరల్డ్‌కప్ అవ్వొచ్చు కాబట్టీ ఎలా అయినా ట్రోఫీ కొట్టే తీరాలి అని భారత క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఇ టోరునమెంట్ లో యే మేరకు రాణిస్తారో చూడాలి .
ఐపీఎల్‌లో శివమ్ దూబే భారీ హిట్టింగ్‌తో భారత 15 మంది సభ్యుల జట్టులో చోటు సంపాదించాడు.రోహిత్‌కి ఓపెనింగ్ పార్ట్‌నర్‌గా యశస్వి జైస్వాల్‌కు ప్రాధాన్యత ఇవ్వబడింది.భారత్ తమ 2024 T20 ప్రపంచ కప్ యుద్దాన్ని ఐర్లాండ్‌తో జూన్ 5న న్యూయార్క్‌లో ప్రారంభించి, ఆపై జూన్ 9, 12 మరియు 15 తేదీల్లో పాకిస్థాన్, USA మరియు కెనడాతో ఆడుతుంది.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com