‘హరి హర వీర మల్లు పార్ట్ 1’ టీజర్: గజ దొంగగా పవర్‌స్టార్ …..టీజర్ లో పవర్‌స్టార్ లుక్ అదుర్స్..
ఈ రోజు ఉదయం 10 గంటలకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన పాన్ ఇండియా చిత్రం “హరి హర వీరమల్లు’ నుండి టీజర్ ను విడుదల చేసారు. ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని కూడా రెండు పార్ట్ లు గా తీస్తున్నారు.బారి సెట్టింగ్ తో 1 నిమిషం 37 సెకండ్ లూ డ్యూరేషన్ తో టీజర్ ని రిలీజ్ చేసారు. టీజర్‌లో పవన్ కళ్యాణ్ లెజెండరీ వీరోచిత అక్రమార్కుడి పాత్రలో తన కత్తి యుద్ధ పరాక్రమాన్ని చూపించాడు.
ఈ చిత్రాన్నీ వకీల్ సాబ్ అప్పుడు మొదలు పెట్టిన షూటింగ్ కి ఆలస్యం లు , పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ వల్ల ఇంకా ఫ్రీలీజ్ చెయ్యలేక పోయారు . ఈ చిత్రం తర్వాత సెట్స్ మీదకి వెళ్లిన చిత్రాలను కూడా పవర్‌స్టార్ పూర్తి చేసి విడుదల చేశారు , కానీ ఈ చిత్రం మాత్రమే విడుదలకు నోచుకోలేదు.
డిసెంబర్ లో మొదటి భాగం ని రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ ఆకారి లో ప్రచురించారు . ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉన్నారు , ఎన్నికల అనంతరం మిగిలి ఉన్నా షూటింగ్ ని ఫినిష్ చేసేలా ప్లాన్ చేసారు మేకర్స్ .మరో వార్త ఈ చిత్రం పై సోషల్ మీడియా లో స్ప్రెడ్ అవుతుంది . దర్శకుడు క్రిష్ ఇప్పటికి ఈ చిత్రం కోసం 3 సంవత్సరాల పైనే టైమ్ కేటాయించారు . ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకుంటున్నారు అని వినిపిస్తోంది . మిగిలిన షూట్ ని వేరే డైరెక్టర్ తో తీసేలా నిర్మాత ప్లాన్ చేసాడు అని ఇండస్ట్రీ టాక్ . డైరెక్టర్ క్రిష్ వేరే ప్రాజెక్ట్ పై దృష్టి పెడతారు అని తెలుస్తుంది.
ఎన్నికల తరవాత పవన్ కళ్యాణ్ వరసగా తన పెండింగ్ సినిమాల షూటింగ్ లో పాల్గొంటారు. OG , HHVM షూట్ లు పూర్తి చేసి తదుపరి ప్రాజెక్ట్ లోకి వెళతారు.ఖుషి తరువాత మెగా సూర్య ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున చిత్రం ఇది . నిధి అగర్వాల్ హీరోయిన్ గా , బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ముఖ్య పాత్రలో మెరవనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com