పంచాయితీ సీజన్ 3 విడుదల తేదీ ప్రకటించిన పైమ్ వీడియో. మే 28 నుండి స్ట్రీమింగ్. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఇండియన్ ఒరిజినల్ సిరీస్ లా లో బెస్ట్ అండ్ క్లీన్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న “పంచాయత్”. మొదటి రెండు సీజన్ లు పెద్ద హిట్ కావటం మరియూ క్లీన్ కంటెంట్ డ్రామా ను ప్రేక్షకులు కి అందిచడం తో మూడో సీజన్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు.గత ఒక నెల నుండి విడుదల తేదీ కోసం అభిమానులు వేచి చేస్తాను వచ్చారు , అయితే వాళ్ల అభిమాన సిరీస్ ఈ నేల 28 నా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతుంది అని ప్రైమ్ వీడియో మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
“పంచాయత్ అత్యంత ఇష్టపడే ఇండియన్ అమెజాన్ ఒరిజినల్స్‌లో ఒకటి, ఇది భారతదేశంలోని ప్రేక్షకులతో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతిధ్వనిస్తుంది. ఈ హృదయాన్ని కదిలించే కామెడీకి ఉన్న ప్రేమ దాని సరళమైన కథనంలో ఉంది, ఇది నెమ్మదిగా సాగే పల్లెటూరి జీవితంలో పాతుకుపోయింది మరియు ఫూలేరా నివాసితులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలపై వ్యంగ్యాత్మకంగా వ్యవహరించడం ద్వారా గట్టిగా అల్లినది. మూడవ సీజన్ ఇంకా ఎక్కువ నవ్వులని అందిస్తుంది” అని ప్రైమ్ వీడియో ఇండియా కంటెంట్ లైసెన్సింగ్ డైరెక్టర్ మనీష్ మెంఘని చెప్పారు.
జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, ఫైసల్ మాలిక్, చందన్ రాయ్ మరియు సాన్విక సహా ప్రియమైన తారాగణం. ది వైరల్ ఫీవర్ రూపొందించిన పంచాయితీ S3కి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించగా, చందన్ కుమార్ రాశారు.హింస మరియు బోల్డ్ కంటెంట్ సిరీస్ లు మాత్రమే వస్తున్న OTT కాలం లో ఒక క్లీన్ విలేజ్ డ్రామా ను చూసి జనాలు ఫుల్ ఖుషీ అయ్యరు మొదటి రెండు సీజన్ ల కి . మూడవ సీజన్ ఓల్డ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి .
మూడవ సీజన్ కథ కూడా సింపుల్ గా నే ఉండబోతుంది .సచివ్ జీ బదిలీని ఎలా తప్పించుకున్నారు , రింకు నీ మళ్లీ కలిస్రా , ప్రధాన్ జీ నీ ఎలా సేవ్ చేసారు అనే పాయింట్స్ తో నే కథ సాగనుండి అని సెసన్ 2 క్లైమాక్స్ బట్టి తెలుస్తుంది .
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com