మల్లి దిల్ రాజు బ్యానర్‌లో విజయ్ దేవరకొండ … రవికిరణ్ కొల్ల దర్శకుడు, ఎస్‌విసి ప్రొడక్షన్
ఫ్యామిలీ స్టార్ తరువత మరోసారి దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ సినిమా. రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ దర్శకుడు . మరి ఇన్ని వివరాలు మే 9 ప్రకటిస్తా అని SVC హ్యాండిల్ నుండి ట్వీట్ చేసారు దిల్ రాజు.
వరుస ఫ్లాప్స్ లో ఉన్నా విజయ్ దేవరకొండ గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేసి ఏప్రిల్ 5న రిలీజ్ చేశారు. హిట్ కాంబినేషన్ కుడా విజయ్ కి బ్రేక్ తీసుకురాలేపోయింది , ఫ్యామిలీ స్టార్ కూడా బాక్సాఫీస్ వద్ద పడిపోయింది.
యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ తో దిల్ రాజు మరో ప్రాజెక్ట్ లైన్ చేసారు. రంగస్థలం తరహ లో పల్లెటూరి డ్రామా కథ ఉండబోతుంది .”రాజా వారు రాణి గారు” మరియు మనోహరమైన “అశోక వనంలో అర్జున కళ్యాణం” చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
అయితే ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. సితార బ్యానర్‌లో నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తరువాత దిల్ రాజు బ్యానర్ లో చిత్రం లో విజయ్ అడుగు పెడతారు .
ఈ చిత్రాన్నీ కూడా బారి బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయీ లో తెరెక్కిస్తున్నారు అని ఇండస్ట్రీ టాక్ . సరైన సినిమా పడితే విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అందరికి తెలుసు , విజయ్ కంబ్యాక్ కోసం అభిమానులు ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com