తారక్ పుట్టినరోజు కీ దేవర మొదటి సింగిల్
దేవర మూవీ నుంచి మొదటి పాట నీ తారక్ పుట్టినరోజు కానుకగా మే 19న విడుదల చేస్తునట్టు మేకర్స్ ప్రకటించారు.నిజానికి దేవర ఏప్రిల్ 5న విడుదల కావాలి.కానీ షూటింగ్ ఆలస్యం మరియు ఇతర కారణాల వల్ల వాయిదా పడింది.
ఈ నెల 20వ తేదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికి తెలిసిందే .అయితే ఈ రోజు దేవర టీమ్ నుంచి ఎలాంటి సప్రైజ్ ట్రీట్ ఉంటుందో అనే అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.ఫ్యాన్స్ కోసం ఫస్ట్ సింగిల్ ని రెడీ చేసి మే 19న రిలీజ్ చేస్తున్నాం అంటూ పోస్టర్ మేకర్స్ తెలియజేసారు.
ఈ సినిమా మ్యూజిక్ పై అందరిలో బారీ అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందించడం. వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో మంచి జోష్ లో ఉన్నారు అనిరుధ్ . దేవర తో తెలుగులో కూడా తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.
దేవర గ్లింప్స్ కి అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా అదే రేంజ్ లో హిట్ అవ్వాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.పోస్టర్ బట్టి మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే సాంగ్ గా ఉంది.
ఆచార్య తర్వాత కొరటాల డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. RRR వంటి మంచి హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున చిత్రం కావటం తో దీనితో ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.మొదటి సింగిల్ రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com