IPL 2024 ప్లేఆఫ్ రేసులో ఉత్కంఠ పోరు , టాప్ 2 పై SRH ఆశలు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్లేఆఫ్ స్థానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) గురువారం గుజరాత్ టైటాన్స్ (జిటి)తో తలపడనుంధి.సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్‌ను ప్రదర్శించాలని భావిస్తోంది.
ఒక విజయం SRH యొక్క ప్లేఆఫ్ బెర్త్‌ను సురక్షితం చేస్తుంది, ఎందుకంటే వారికి మొదటి నాలుగు స్థానాలకు మరో పాయింట్ మాత్రమే అవసరం. అదనంగా, ఆరోగ్యకరమైన నెట్ రన్ రేట్ +0.406 మరియు మరో గేమ్ మిగిలి ఉన్నందున, SRH ఇప్పటికీ మొదటి-రెండు ముగింపు కోసం పోరాడవచ్చు.
KKR మరియు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే IPL 2024 ప్లేఆఫ్‌లకు అర్హత సాధించాయి.మిగిలిన రెండు స్థానాలు కోసం 4 జట్లు పోటీ పడుతున్నాయి. వాటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి అవకాశాలు ఉన్నాయి.మిగిలిన రెండు మ్యాచ్‌లు ఓకటి గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ ఫిక్స్ అని చెప్పొచ్చు.
అయితే మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ టూ లో ఫినిష్ అవ్వొచ్చు.పాజిటివ్ రన్ రేట్ వల్ల క్వాలిఫైయర్ 1 రేసు లో నిలవొచ్చు.లీగ్ ప్రథమార్ధంలో నిరంతర విజయాలు తో ఉన్నా రాజస్థాన్ రాయల్స్ , సెకండ్ హాఫ్ లో వరసుగా 4 మ్యాచ్‌లు ఓడిపోయింది.
శనివారం జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో చెన్నై విజయం సాధిస్తే ప్లేఆఫ్ కి చేరుకుంటుంది.రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్ కి చేరుకోవాలి అంటే చెన్నై ఇచ్చిన టార్గెట్ ని 18.1 ఓవర్లలో చేజ్ చేయాలి , లేక చెన్నై పై 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి.
లక్నో కి కూడా 14 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది కానీ నెట్ రన్ రేట్ తక్కువ ఉండడం వల్ల క్వాలిఫైయింగ్ అవకాశాలు తక్కువ.ఢిల్లీకి ఇప్పటికే 14 పాయింట్లు ఉన్నా రన్ రేట్ కారణం గా ప్లేఆఫ్ అవకాశాలు తక్కువ.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com