మే 31 న థియేటర్లలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల
విశ్వక్ సేన్ నటించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఈ నెల 31న రిలీజ్ చేస్తాం అని ప్రకటించారు.ట్రెండింగ్ లో ఉన్నా ఆవేశం మీమ్ టెంప్లేట్ స్టైల్ లో విశ్వక్ సేన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తు వీడియో చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.
అయితే ఎన్నికలు పూర్తి అయిన సరే మే 17న విడుదల చేయట్లేదు మేకర్స్.ఈ సినిమా విడుదల తేదీని 3 నుంచి 4 సార్లు వాయిదా వేశారు.ఐపీఎల్ కూడా మే 24న ముగియనుంది కాబట్టీ , మే 31న రిలీజ్ కి పర్ఫెక్ట్ అని మేకర్స్ ఫిక్స్ అయ్యరు.
ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ గ్రాండ్‌గా నిర్మించారు.యువన్ శంకర్ రాజా ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికే మంచి బజ్ తీస్కోచాయి.
ఈ రెండు వారాల్లో సినిమాను పూర్తిగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేశారు.గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నాగ వంశీ ప్లాన్ చేస్తున్నారు , జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు అని ఇండస్ట్రీ టాక్.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com