కృష్ణ పుట్టినరోజు నాడు #SSMB29 సినిమా అప్‌డేట్ ఉండొచ్చు….!
బ్లాక్‌బస్టర్ ‘RRR’ ప్రత్యేక ప్రదర్శన కోసం S.S రాజమౌళి జపాన్ పర్యటనలో రాబోయే చిత్రం #SSMB29 కోసం ప్రకటన తరంగాలను చేసింది. అయితే, కథానాయకుడిని పక్కన పెడితే, అభిమానులకు వివరాలు మిస్టరీగా మిగిలిపోయాయి.
జక్కన్న పర్ఫెక్షనిజం గురించి మనకి తెలిసిందే , అందుకే ప్రీ ప్రొడక్షన్ కే వన్ ఇయర్ పైనే తీసుకుంటున్నారు.
RrR సినిమా తరువాత ప్రపంచ ప్రేక్షకులు అందరు రాజమౌళి గారి తదుపరి ప్రాజెక్ట్ కోసం ఏడుచూస్తున్నారు . మహేష్ తో చేయబోయే ఈ సినిమా ప్రకటన వీడియో ని లంచనగా కృష్ణ గారి పుట్టిన రోజు నాడు విడుదల చేయనున్నారు అని తెలుస్తున్నది .
రాజమౌళి ‘RRR’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విజయం మరియు ప్రశంసలు పొందిన తరువాత, తెలుగు స్టార్ మహేష్ బాబు నటించే అతని తదుపరి ప్రాజెక్ట్ వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
ఈ నెల 31న కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా , ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేస్తారు అని వినిపిస్తోంది.సినిమా యొక్క జానర్ గురించి చిన్న వివరాలతో ప్రకటన వీడియో ఉండవచ్చు.కృష్ణ గారి బర్త్‌డేకి అనౌన్స్‌మెంట్ లేదా ఎదో అప్‌డేట్ ఇవ్వడం అంటే మహేష్ కి సెంటిమెంట్ కాబట్టి ఈ సెంటిమెంట్ తో నే ఆ రోజు అనౌన్స్ మెంట్ ఉండొచ్చు అని అందరూ నమ్ముతున్నారు.
SSMB29 సినిమా తో ప్రపంచ రికార్డ్ లు బద్దలుకొట్టాలి అని జక్కన్న మరియు మహేష్ ఫిక్స్ అయిపోయారు . ఇండియాలో నే అతి ఎక్కువ బడ్జెట్ సుమరుగ 1000 కోట్లు తో కెఎల్ నారాయణ ఈ సినిమా ను నిర్మించబోతున్నారు.
మూడు పార్ట్ లు గా ఈ సినిమా ను జక్కన తియ్యబోతునారు . వరల్డ్ వైడ్ రీచ్ కోసం హాలీవుడ్ నటులుఅను కూడా తిస్కోబోతునారు.బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా దాదాపు కరారు అయ్యింది అని ఇండస్ట్రీ టాక్.
ప్రతి ఇండస్ట్రీ నుండి పేరు ఉన్న నటులను కలిపి బారి కాస్టింగ్‌తో ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ జరిపి 2026 కి మొదటి భాగాన్ని విడుదల చేయబోతున్నారు.మహేష్ బాబు ఇప్పటికే పొడవాటి జుట్టు పెంచారు , అభిమానులు ఆ లుక్ కి చాలా ఆనందంగా ఉన్నారు
ఇండస్ట్రీ వర్గాలనుండి కూడా అనౌన్స్‌మెట్ అని వినిపిస్తోంది.ఆగస్ట్ వరకు షూటింగ్ ప్రారంభం అవ్వదు అని తెలిసిన విషయమే , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీ గా ఉంది ప్రెజెంట్ యూనిట్.హాలీవుడ్ హీరో ల కి దీటుగా మహేష్ కొత్త లుక్ ఉంది
#SSMB29 గురించి మరిన్ని విషయాలు
నిన్న ఒక ఇంటర్వ్యూ లో సుధీర్ బాబు మాట్లాడాడు మహేష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అని , కంప్లీట్ గా డైట్ ని మార్చేశాడు అని చెప్పాడు . బాడీ మీద ఎప్పుడు లేని విధం గా వర్కవుట్ చేస్తున్నారు అని, అతను తన బెస్ట్ ఇవ్వడానికి ప్రతిదానికీ సిద్ధంగా ఉన్నాడు.
మహేష్ బాబు నుండి వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇది , టక్కరి దొంగ తరహ లుక్ లో మహేష్ కనిపించబోతున్నారు అని ఫ్యాన్స్ ఊహల్లో ఉన్నారు .
ఇప్పటికే ఇది ఇండియన్ జోన్స్ తారహ లో అడ్వెంచర్ ట్రావెల్ టైప్ స్టోరీ అని రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ తెలిపాడు.మూడు భాగాల సిరీస్ గా ఉంటుంది , మెయిన్ లీడ్ మాత్రమే మార్పు కాదు అని రైటర్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విషయం తెలిసిందే
2024 ఎండింగ్ కి గాని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాదు అని అనుకోవచ్చు , అందుకే జక్కన్న పోస్ట్ ప్రొడక్షన్ దశలో నే చాలా టైమ్ తీసుకుంటారు.కల్కి స్టైల్ లో ప్రతి ఇండస్ట్రీ నుండి టాప్ యాక్టర్స్ కి ఛాన్స్ ఉంది . కల్కి లో తమిళ్ నుండి కమల్ , హిందీ నుండి అమితాబ్ ని తీసుకున్నరు.
ఈ ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే కి ఖలేజా ని రీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఫ్యాన్స్ ఉన్నారు.మే 31న అప్‌డేట్ రాకపోతే ఆగస్టు 9న అప్‌డేట్ వస్తుంది.కానీ యూనిట్ నుండి ఎలాంటి బజ్ లేదు , కాబట్టీ అప్‌డేట్ కన్ఫర్మ్ అని చెప్పలేం.చిన్నా అనౌన్స్ మెంట్ అయినా అయితే కాచింతంగా ఉంటుంది , ఎందుకంటే అది మహేష్ సెంటిమెంట్ డే
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com