హాలీవుడ్ ఎంట్రీ కి ప్రభాస్ సిద్దం , అదిరిపోయిన కల్కి సినిమా టీజర్
కల్కి సినిమా నుండి బుజ్జి అనే క్యారెక్టర్ ని పరిచయం చేసారు నాగ్ అశ్విన్ అండ్ టీమ్.ఇది ఒక కార్ కి నాగ్ అశ్విన్ పెట్టిన పేరు . నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో పరిమిత ప్రేక్షకులతో ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రభాస్ మరియు కొంత మంది తారాగణం ఇందులో పాల్గొన్నారు .
ఈవెంట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినిమాలో భైరవ గెట్ అప్ లో ప్రభాస్ కనిపించాడు.ఆ కటౌట్ కి ఫ్యాన్స్ అంతా మెస్మరైజ్ అయ్యారు.
బుజ్జి అని టీజర్ ని రిలీజ్ చేసారు . ఈ టీజర్ విషయానికి వస్తే హాలీవుడ్ లెవల్ మేకింగ్ తో నాగ్ అశ్విన్ అదరగొట్టేసారు అని చెప్పాలి.అదిరిపోయే విజువల్స్ తో , టాప్ స్టైల్ మేకింగ్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా తీశారు నాగ్ అశ్విన్ . అసలు భైరవ ఎవరు , బుజ్జి అనే కార్ తో ఏం చేయనున్నాడు అనేది ఇంకా సస్పెన్స్ గా నే ఉంది.
సంతోష్ నారాయణ ఇచ్చిన స్టైలిష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది .ఇంగ్లీష్ లిరిక్స్ తో మంచి స్టైలిష్ బిజిఎమ్ అందిచారు సంతోష్ నారాయణ.విజువల్స్ కూడా గ్రాండియర్ గా ఉన్నాయి .ప్రభాస్ లుక్స్ కూడా టాప్ నాచ్ గా ఉన్నాయ్ .
నాగ్ అశ్విన్ మరియు యూనిట్ ప్రపంచ సినిమా అంటే ఏంటో అనుకున్నా , నిజముగా నే హాలీవుడ్ రేంజ్ సినిమా ని తీశారు . హిందూ పురాణాలలో సైన్స్ ఫిక్షన్ కలిపి నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్ లో రెండు పార్ట్స్ గా ఈ మూవీని తీస్తున్నారు.
జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో కల్కిని రిలీజ్ చేస్తున్నారు. ఈ లోపు అన్నీ భాషల్లో గ్రాండ్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook
website: updatespub.com