ఫైనల్స్‌లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్, టైటిల్ కి అడుగు దూరం లో కమిన్స్ టీమ్

0
Spread the love

IPL 2024 : చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడింది.క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన సన్ రైజర్స్ , ఎలిమినేటర్ లో గెలిచిన రాజస్థాన్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోరాడారు.

టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఏంచుకున్నారు . మొదట బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లకు 175 పరుగు లు మాత్రమే చేయగలిగింది. క్లాసీన్ హాఫ్ సెంచరీ, హెడ్ మరియు త్రిపాఠి క్విక్ ఫైర్ 30+ స్కోర్లు చేసారు. మొదటి 10 ఓవర్లకు మంచి స్థానం లో నే ఉన్నా రైజర్స్ ఇన్నింగ్స్ ని సరిగ్గా ముగించలేకపోయారు.

176 పరుగు లు లక్ష్యం తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ తొలి 7 ఓవర్లలో మంచి స్కోర్ చేసి విజయం వైపు దూసుకుపోయే దశలో ఉన్నారు , అప్పుడే కెప్టెన్ కమిన్స్ స్పిన్నర్లను పరిచయం చేసి మ్యాచ్ ఫేజ్ మార్చేశాడు.

పార్ట్ టైమ్ స్పిన్నర్ అభిషేక్షర్మ రెండు వికెట్లు , షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీసి రాజస్థాన్ జోరుకి బ్రేక్ లు వేసారు.లాస్ట్ లో పేసర్ లు కూడా మంచిగా బౌలింగ్ వేసి రాజస్థాన్ బ్యాటర్స్ ని కట్టడి చేసారు.జ్యూరల్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా , వేరే బ్యాట్స్‌మెన్ సహకారం లేకపోడం తో టార్గెట్ రీచ్ కాలేకపోయారు రాజస్థాన్ రాయల్స్.

ఆదివారం జరగనున్న ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తలపడనున్నారు. చెపాక్ వేదికగా టైటిల్ పోరులో రెండు జట్లు తలపడనున్నాయి.

Follow Us: @updatespub
Twitter
Instragram
Facebook

website: updatespub.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *